GARUDA SEVA HELD _ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 13 JULY 2022: The monthly Garuda Seva was performed with grandeur in Tirumala on the auspicious day of Ashada Guru Poornima.

 

Sri Malayappa Swamy took out a celestial ride on the mighty Garuda Vahanam along the four mada streets to bless His devotees.

 

Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, Peishkar Sri Srihari, Parupattedar Sri Uma Maheswar Reddy and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2022, జులై 13: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురుపౌర్ణమి కావడంతో విశేషంగా భక్తులు విచ్చేశారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వరరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.