TRAINING TO OFFICIALS _ టీటీడీ అధికారులు, ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలి – జె ఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 13 JULY 2022: Strengthen your physical and mental abilities with stress-free training, said TTD JEO (H & E) Smt Sada Bhargavi.

The four-day training programme to senior officers of TTD to overcome stress commenced for first batch officials on Wednesday in SVETA Bhavan in Tirupati.

With the coordination of the Orissa-based Jai Ganga Life Coaching Academy, the officers are being trained on how to keep their Mind, Body and Soul stress-free from domestic and professional work tensions.

Speaking on the occasion the JEO said this training will be very useful to the officials who are bounded by Stressful work life.

The trainer from the Orissa-based Institute Sri Kiran said if we are compassionate enough we can lead a happy life.

Another trainer Smt Mangala Narayani, SVETA Director Smt Prasanti and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ అధికారులు, ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలి – జె ఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 13 జూలై 2022: సనాతన హిందూ ధర్మ ప్రచార వారధులుగా పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు సమధర్మ భావనతో మెలగాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు.

నిత్య జీవితం, ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడిని జయించడానికి శ్వేత, ఒడిశా కు చెందిన జై గంగ లైఫ్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్లకు శ్వేతలో నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తొలిరోజైన బుధవారం శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శరీరం, మనసు యాంత్రికంగా మారిన నేటి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ధర్మ మార్గంలో నడిచే టీటీడీ ఉద్యోగులు తమ మార్గాన్ని మరింత మంచిగా తయారు చేసుకోవచ్చన్నారు. అధికారులు, ఉద్యోగులు ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా అర్థం చేసుకుని, మనసుతో పరిష్కార మార్గాలు ఆలోచించాలని సూచించారు. తెలీకుండానే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి సానుకూల ఆలోచనలు, ఒత్తిడిని జయించే శక్తి ,ఆలోచన అవసరమని ఆమె వివరించారు.

అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ఏపనైనా విజయవంతం అవుతుందని అన్నారు.
జై గంగ లైఫ్ అకాడమీ నిర్వాహకులు శ్రీ కిరణ్ జీ ఒత్తిడిని జయించే మార్గాలపై శిక్షణ ఇచ్చారు. మనిషి అంతర్ముఖం, బాహ్య ముఖం అనే రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నారని శ్రీ కిరణ్ జీ చెప్పారు. క్షమా గుణం అలవరచుకుంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చని అన్నారు. సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ మంగళ నరాయణి జీ, శ్వేత సంచాలకురాలు శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.

జూలై 16వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.