RENDER DEDICATED SELFLESS SERVICES- PERSONALITY DEVELOPMENT TRAINERS _ అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించండి : వ్యక్తిత్వ వికాస నిపుణులు

TIRUMALA, 13 JULY 2022: Offer dedicated and selfless services to attain Moksha, said Personality Development trainers to Srivari Seva volunteers.

The representatives of Jai Ganga Life Academy Organisers from Odisha Sri Kiran addressing a huge gathering of Srivari Sevaks at Seva Sadan 2 in Tirumala on Wednesday evening said the volunteers have been doing impeccable services to the multitude of visiting pilgrims coming to Tirumala for the Darshan of Sri Venkateswara Swamy.

He called upon them to strengthen their body, mind and soul through the way of meditation which will help them to enhance the energy level and serve devotees with more enthusiasm and devotion.

Later another trainer Smt Mangala Narayani said Srivari Seva is a best example of how to lead a compassionate life as it involves selfless service.

TTD PRO Dr T Ravi, APRO Kum P Neelima, AEO Smt Nirmala, OSD Sri Phani Ranga Sai, other staffs, Srivari Seva volunteers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించండి : వ్యక్తిత్వ వికాస నిపుణులు

తిరుమల, 13 జులై 2022: మోక్షం పొందేందుకు అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించారు. తిరుమలలోని సేవాసదన్ -2లో బుధవారం సాయంత్రం జరిగిన సత్సంగం కార్యక్రమంలో శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన జై గంగా లైఫ్ అకాడమీ నిర్వాహకులు శ్రీ కిరణ్ ప్రసంగిస్తూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు సేవకులు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. ధ్యానం ద్వారా శరీరాన్ని, మనసును, ఆత్మను బలోపేతం చేసుకోవాలని, భక్తులకు మరింత ఉత్సాహంతో, భక్తితో సేవ చేయడానికి ఇది సహాయపడుతుందని అన్నారు.

అనంతరం మరో శిక్షకురాలు శ్రీమతి మంగళ నారాయణి మాట్లాడుతూ నిస్వార్థ సేవ చేస్తూ జీవితాన్ని ఎలా సాగించాలో శ్రీవారి సేవ ఉత్తమ ఉదాహరణ అన్నారు.

టిటిడి పిఆర్వో డా. టి.రవి, ఏపిఆర్వో కుమారి పి.నీలిమ, ఏఈవో శ్రీమతి నిర్మల, ఓఎస్డీ శ్రీ ఫణిరంగ సాయి, ఇతర సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.