PRANAYA KALAHOTSAVAM ON JAN 11 _ తిరుమలలో జనవరి 11న శ్రీవారి ప్రణయకలహోత్సవం

Tirumala, 10 Jan. 20: The annual event of Pranaya Kalahotsavam will be observed in Tirumala on January 11.

As a part of the festivities, the utsava idols of Sri Malayappaswamy and His consorts will be taken out on palanquins from Vaibhavotsava mandapam and come face to face at Sri Varahaswami temple.

The archakas will chant chant Divya Prabandam pasuras separately and later re enact the mythological Flower play described as  – pranaya kalaham – in a colourful and grand style. The deities will throw floral balls at each other. It will be a feast to cherish escaping the floral ball jolts of Goddesses during this fete.

TTD has cancelled arjita seva of Vasantotsavam on the day at Srivari temple and all officials would participate in a big way.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

తిరుమలలో జనవరి 11న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల,  2020 జనవరి 10: శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 11వ తేదీ శ‌నివారం తిరుమలలో వైభవంగా జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.