2022 TTD CALENDARS AND DIARIES AVAILABLE FOR SALES _ 2022 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

TIRUMALA, 11 OCTOBER 2021: The 2022 TTD’s Calendars and Diaries were released by the Honourable CM of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy on Monday at Tirumala temple.

TTD had published a total of 15lakh 12-sheet calendars priced at Rs.130 each, Eight lakh Deluxe Diaries(Rs.150), Two lakh small Diaries priced at Rs.120 each, One lakh Table Top Calendars at Rs.75 each, Sri Venkateswara Swamy (single-big) calendars-3,50,000 copies priced at Rs.20 per piece, Srivaru and Ammavaru calendars-4,00,000 at Rs.15 each,  10 thousand copies of Sri Padmavathi Ammavaru (Single Big) at Rs15 per piece, 2,50,000 copies of  Telugu Panchagam calendars priced at Rs.30 per piece.

These Calendars and Diaries are now onwards available for sales in all TTD book stalls for pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమ‌ల, 2021 అక్టోబ‌రు 11: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు ల‌క్ష‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.