భక్తుల సేవలో శ్రీవారి సేవకులు
భక్తుల సేవలో శ్రీవారి సేవకులు తిరుమల, సెప్టెంబర్- 14, 2009: మానవసేవయే మాధవసేవగా భావించి క్రమశిక్షణ, సేవాతత్పరతకు భక్తిభావాలకు మారుపేరైన శ్రీవారి సేవకులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను చూసి తరించడానికి తిరుమలకు రానున్న వేలాది మంది భక్తులకు తమ ఉచిత సేవలను అందించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో 2వేల మంది శ్రీవారి సేవకులు తిరుమలకు విచ్చేస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ,ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి వస్తున్నారు. తిరుమలలోని అన్నదానం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూకాంప్లెక్స్, […]
