ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు తిరుపతి, ఆగస్టు 04, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగియనున్నాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్ శాత్తుమొర […]
