తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం తిరుపతి, జూన్ 22, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, సామవేద పుష్పాంజలి నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7.45 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో అమ్మవారు ఐదు […]
