కోసువారిపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు తిరుపతి/కోసువారి పల్లి,2025, సెప్టెంబర్ 05: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం చతుస్రనామార్చన, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వీధి ఉత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టిటిడి ప్రధాన ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది. Tirupati/Kosuvaripalle, September 05, 2025: The annual Pavithrotsavams at Sri Prasanna Venkateswara Swamy Temple in Kosuvaripalle, Tamballapalle Mandal of Annamayya district, concluded on Friday with the performance of Maha Poornahuti. As part of the concluding rituals, sacred programs including Chatusranaamarchana, Maha Poornahuti, Pavitra Visarjana, Snapana Tirumanjanam, and Chakrasnanam […]