TTD ONE MORE STEP IN COMBATING COVID-19 _ కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు టిటిడి మరో ముందడుగు

THERMAL SCANNING AT TTD ADMINISTRATIVE BUILDING IN TIRUPATI

VISITORS BARRED, SANITIZER EQUIPMENTS IN PLACE

Tirupati, 23 Mar. 20: TTD management has rolled out one more initiative to combat the deadly corona virus by barring visitors to the TTD administrative building and also imposing mandatory thermal scanning for all it’s employees attending duty.

All employees are permitted inside the building only after they wash they sanitize their hands with sanitizers provided at the entry gates.

TTD has also issued guidelines against gathering of more persons at any point and instructed to work on shift basis till April 4.

Option of work given to 50% to work through e-office app and other 50% to work from office. All those working from home to coordinate with their respective HoDs.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు టిటిడి మరో ముందడుగు
 
పరిపాలనా భవనంలో థర్మల్ స్కానింగ్ పరీక్షలు
 
అందుబాటులో శానిటైజింగ్ ప‌రిక‌రాలు
 
సందర్శకుల నిలిపివేత
 
తిరుపతి, 2020, మార్చి 23: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్న టిటిడి యాజమాన్యం సోమవారం మరో ముందడుగు వేసింది. తిరుపతిలోని పరిపాలనా భవనంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు థర్మల్  స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిపాలనా భవనం ప్రధాన ద్వారం వద్ద చేతులు శుభ్రం చేసుకున్నాకే లోనికి అనుమతిస్తున్నారు. పరిపాలనా భవనం లోపల  కూడా చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప‌లు చోట్ల శానిటైజర్ ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచారు. పరిపాలనా భవనంలో ఉద్యోగులు ఎక్కువ మంది ఒక చోట చేరకూడదని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేలకు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉద్యోగులకు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించేందుకు అనుమతించారు. 50 శాతం మంది వారం రోజుల పాటు కార్యాలయానికి హాజరైతే, మిగిలిన 50 శాతం మంది ఇంటినుంచి ఈ ఆఫీస్ ద్వారా విధులు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇంటినుంచి పనిచేసే  సిబ్బంది త‌మ విభాగాధిపతుల‌కు ఫోన్లో అందుబాటులో ఉండాలని టిటిడి యాజమాన్యం ఆదేశించింది. అత్యవసర విధులు నిర్వహించే విభాగాల సిబ్బంది మాత్రం ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.