చిన్న‌శేష‌ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

చిన్న‌శేష‌ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల, 2023 సెప్టెంబరు 19: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ‌ రోజైన మంగ‌ళ‌వారం ఉదయం చిన్న శేష‌ వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆవిష్కరించారు.

శ్రీ అర్చ‌కం రామ‌కృష్ణ దీక్షితులు రచించిన ” శ్రీ వేంక‌టేశ్వ‌స్వామివారు ” గ్రంథాన్ని ఆవిష్క‌రించారు. ఇందులో స‌ప్త‌గిరుల‌కు శ్రీ‌వారి సుంద‌ర రూపం ఎలా వ‌చ్చింది, మొద‌ట స్వామిని ఎవ‌రు చూశారు, ఎవ‌రు ముందుగా అర్చించారు, శిల్ప‌శాస్త్ర ప‌రంగా, ఆగ‌మ శాస్త్ర ప‌రంగా శ్రీ‌వారి విగ్ర‌హ ల‌క్ష‌ణాలను ఇందులో తెలియ‌జేశారు.

” శ్రీ వేంక‌టేశ్వర‌ స‌చిత్ర సుప్ర‌భాతం ” తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో గ్రంథాన్ని ఆవిష్క‌రించారు. పిల్ల‌లు, నేటి యువ‌త‌కు శ్రీ వేంక‌టేశ్వర సుప్ర‌భాతం అర్థ‌మ‌య్యేలా ఆక‌ర్ఫ‌ణీయ‌మైన తైల వ‌ర్ణ చిత్రాల‌తో, ఆర్థ‌తాత్ప‌ర్య‌లతో టీటీడీ తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో అందించింది.

డా|| గాలి గుణ‌శేఖ‌ర్ ర‌చించిన ” హిందూమ‌త పురాణ‌గ‌ళ‌ల్ నీతికదైగ‌ళ్ ” గ్రంథం. భాగ‌వ‌త‌, పురాణ‌ల‌లోని 50 నీతిక‌థ‌ల‌ను సేక‌రించి గ‌తంలో శ్రీ కోలార్ కృష్ణ‌య్య‌ర్ ఆంగ్లంలో ర‌చించిన మోర‌ల్ ఫేబుల్స్ అనే గ్రంథం త‌మిళంలో అనువాదించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్ ఈ -2
శ్రీ జగదీశ్వర్ రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ విభీష‌ణ శ‌ర్మ‌, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.