KSHEEERADHIVASAM FETE AT RAMPACHODAVARAM _ రంపచోడవరంలో ఆగమోక్తంగా క్షీరాధివాసం

VIGRAHA PRATISTA ON MAY 21

 

Tirupati, 20 May 2023: As part of Maha Samprokshana fete at the newly built Sri Venkateswara temple at Rampachodavaram in Alluri Sitaramaraju district, TTD observed Ksheeradhivasam on Saturday.

 

The fete comprised of abhisekam to the idols of Sri Venkateswara, Sri Padmavati, Sri Godadevi, Sri Garudalwar, Dwarapalakas with cow milk besides temple gopuram and Dwaja sthambhams.

 

The rituals which commenced at yagashala in the morning will be continued in the evening as well.

 
VIGRAHA PRATISTA ON MAY 21

 

On May 21, as part of Maha Samprokshana fete the main idols of Sri Venkateswara, Sri Padmavati,Sri Goda Devi and Sri Garudalwar besides  Dwarapalakas will be consecrated amidst Vedic mantras and Mangalam vaidyams.

 

One of the Chief Priests of Srivari temple Sri Venugopal Deekshitulu, DyEOs Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Shivprasad, DyEE Sri Ananda Ram were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రంపచోడవరంలో ఆగమోక్తంగా క్షీరాధివాసం

– మే 21న విగ్రహప్రతిష్ట

తిరుపతి, 2023 మే 20: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు.

ఉదయం బింబశుద్ధి కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను గోవు పాలతో అభిషేకం చేశారు. అదేవిధంగా ఆలయ విమానగోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.

మే 21న విగ్రహప్రతిష్ట :

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహస్థాపన చేపట్టనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, డెప్యూటీ ఈఈ శ్రీఆనంద రామ్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.