TIRUMALA TEMPLE DOORS REOPENS- SARVA DARSHAN RESUMES FOR PILGRIMS _ శ్రీ‌వారి ఆల‌యంలో స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభం

SOLAR ECLIPSE CONCLUDES AT 6:27pm

ANNA PRASADAM ACTIVITY ALSO RESUMES

Tirumala, 25 October 2022: TTD will resume Srivari Sarva Darshan at Tirumala temple from 8.30 pm onwards after temple shuddi and other Kainkaryams with the solar eclipse ending at 6.27 pm.

Earlier, Sarva Darshan was allowed between 7am and 7:45am for devotees waiting in compartments and the temple was closed at 8.11am as scheduled before.

The temple doors were opened for almost after 12 hours at 7.30pm and after temple cleansing rituals, Sarva Darshan devotees will be allowed for Darshan.

ANNA PRASADAM DISTRIBUTION BEGINS

The Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Bhavan was closed at 8.11 am on Tuesday and reopened at night 7.30 pm after shuddi of kitchen and Anna Prasadam to devotees began at 8.30pm.

In view of the closure of MTVAC following Grahanam, nearly 10,000 devotees were served breakfast from 6 am at food counters and 30,000 pulihora packets were distributed to devotees at Vaibhavotsava Mandapam.

TTD EO Sri AV Dharma Reddy, DyEO Sri Harindranath, Peishkar Sri Srihari, AEO Sri Parthasarathy and VGO Sri Bali Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభం

– ముగిసిన సూర్య‌గ్ర‌హ‌ణం

– రాత్రి 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌

తిరుమ‌ల‌, 2022 అక్టోబ‌రు 25: శ్రీ‌వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు. సాయంత్రం 5.11 నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉద‌యం 8.11 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూశారు.

దాదాపు 12 గంట‌ల అనంత‌రం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, రాత్రి కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. రాత్రి 8.30 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 8.11 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును రాత్రి 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్ మూసివేత వ‌ల్ల భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉద‌యం 6 గంట‌ల‌కు ఫుడ్ కౌంట‌ర్ల‌లో దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. అదేవిధంగా, వైభ‌వోత్స‌వ మండ‌పం, సిఆర్వో వ‌ద్ద దాదాపు 30 వేల పులిహోర పొట్లాలు భ‌క్తుల‌కు పంపిణీ చేశారు.

టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, విజివో శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.