LOCAL TTD TEMPLES CLOSED AT 8AM FOR SOLAR ECLIPSE _ సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంట‌ల‌కు టీటీడీ స్థానిక ఆలయాల మూత

Tirupati,25 October 2022: All the TTD local temples were closed at 8 am in view of solar eclipse on Tuesday.

They included Sri Padmavati temple in Tiruchanoor, Sri Govindarajaswami temple, Sri Kodandaramaswami temple, Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram, Sri Prasanna Venkateswara Swamy temple, in Appalayagunta.

The solar eclipse occurred at 4pm and it is a practice to shut down the temple six hours ahead of the eclipse occurrence.

After performing temple shuddi and other purificatory rituals temples will be reopened for darshan for devotees after 7pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంట‌ల‌కు టీటీడీ స్థానిక ఆలయాల మూత

తిరుపతి, 2022 అక్టోబ‌రు 25: సూర్య‌గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంట‌ల‌కు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేశారు.

మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంట‌లకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.