JAGADABHI RAMA SHINES ON BHAKTA HANUMAN _ హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి […]
