NAVANEETAKRISHNA MESMERIZES _ న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

Vontimitta, 20 April 2024: As a part of the ongoing Vontimitta Sri Kodandarama swamy annual Brahmotsavam, on the fourth day of Saturday morning, Sri Rama as Navanitha Krishna made a charming appearance.

From 7.30 in the morning, the procession of Swami commenced and took place in grandeur.  

The Kerala drums, chekkabhajans and kolatams by the groups of artistes, enhanced the glory of the procession.

Temple Deputy EO Sri. Natesh Babu, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Naveen participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ‌నివారం ఉదయం న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌. రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.