PATTABHISHEKAM AT TIRUPATI RAMALAYAM _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirupati, 19 April 2024: The celestial Sri Rama Pattabhishekam was held with religious fervour in Sri Kodanda Ramalayam at Tirupati on Friday.

The ceremonious coronation ceremony was held in a grand affair amidst chanting of Vedic hymns followed by Asthanam by the temple priests.

Additional FACAO Sri Raviprasadu, DyEO Smt Nagaratna, AEO Sri Parthasaradhi and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి, 2024 ఏప్రిల్ 19: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 గంటలకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, అదనపు ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ రవి ప్రసాదు, ఏఈవో శ్రీ పార్థ‌సార‌థి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.