యాత్రికులకు అందుబాటులో విష్ణునివాసం వసతి సముదాయం
యాత్రికులకు అందుబాటులో విష్ణునివాసం వసతి సముదాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తితిదే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం పేరిట యాత్రికుల వసతి సముదాయం నిర్మించింది. ఆర్టిసి బస్టాండుకు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ వసతి సముదాయం సాధారణ యాత్రికులకు చాలా అనువుగా ఉంటోంది. ఇందులో 204 ఏసీ గదులు, 204 నాన్ ఏసీ గదులు, 24 డార్మిటరీ హాళ్లు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ భక్తుల […]
