మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి
మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుపతి, మే 21, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం ఉదయం గోవిందరాజస్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 6.00 గంటలకు పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పుష్కరిణి, శ్రీ కోదండరామాలయం వరకు వెళ్లి తిరిగి ఉదయం 10.00 గంటలకు స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం […]
