EKADASI KALYANAMS AT UPAMAKA SV TEMPLE FROM MARCH 4-12 _ మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు
మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరాలయంలో ఏకాదశి కల్యాణాలు తిరుపతి, 2020 ఫిబ్రవరి 27: టిటిడికి అనుబంధంగా ఉన్న విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో మార్చి 4 నుంచి 12వ తేదీ వరకు ఏకాదశి కల్యాణాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు పెళ్లికావాడి ఉత్సవం, సాయంత్రం 5.45 నుండి 7.00 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రుత్విక్ వరుణం, మృత్సుంగ్రహణము నిర్వహించనున్నారు. […]
