ANNAMAIAH SANKEERTANA YAGNAM ON FEB 24 AND 25 _ ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం”

Tirupati, 22 Feb. 20: The community singing of the great sankeertans penned by Saint Poet Sri Tallapaka Annamacharya will be rendered by the Annamacharya Project artistes on February 24 and 25 in Tirupati.

There will be a procession of the utsava deity of Annamaiah from TTD Administrative building on February 24 by 3pm. A non-stop Sankeertana Yagnam will be rendered by artistes of the project from 6pm of February 24 till 6pm of February 25 at Annamacharya Kalamandiram in Tirupati.

The project officer Sri B Vishwanatham is supervising the arrangements for the fete.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో ”అన్నమయ్య  సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం”

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 22: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య  సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య భ‌మిడిపాటి విశ్వ‌నాథ్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 24న సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం నుండి అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హం ఊరేగింపు మొద‌ల‌వుతుంది. క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ‌తారు. సాయంత్రం 6 గంటల నుండి మ‌రుస‌టిరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.