ఫిబ్రవరి 17న తితిదే అనుబంధ ఆలయాల్లో రథసప్తమి
ఫిబ్రవరి 17న తితిదే అనుబంధ ఆలయాల్లో రథసప్తమితిరుపతి, ఫిబ్రవరి 12, 2013 : తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఫిబ్రవరి 17వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం చురుగ్గా […]
