ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 06, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
 
ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 12న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి పెద్దశేష వాహనం, ఫిబ్రవరి 13న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సింహవాహనం, ఫిబ్రవరి 14న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, ఫిబ్రవరి 15న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, ఫిబ్రవరి 16న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజ వాహన సేవలు జరుగనున్నాయి.
అలాగే ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5.00 గంటల వరకు రథోత్సవం, రాత్రి ధూలి ఉత్సవం, ఫిబ్రవరి 18న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి అశ్వ వాహనం, ఫిబ్రవరి 19న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
 
కాగా ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 7.00 గంటలకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.