శ్రీవారి ఆలయంలో రేపు శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో రేపు శ్రీరామనవమి ఆస్థానం తిరుమల, 2010 మార్చి 23: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24వ తేదిన శ్రీరామనవమి ఆస్థానం, 25వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది. మార్చి 24వ తేదిన శ్రీవారి ఆలయంలో సహస్రకలశాభిషేకం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దుచేశారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున బంగారు వాకిలి ముందు శ్రీరాముల వారికి ఆస్థానం జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు తిరువీధులలో […]