DEVOTIONAL GALA DURING BRAHMOTSAVAMS _ వాహ‌న‌సేవ‌ల్లో క‌నువిందుగా కళారూపాలు

1900 ODD ARTISTS FROM 90 ODD GROUPS PERFORM DURING THE FETE 

TIRUMALA, 03 OCTOBER 2022: A grand devotional gala by various artistes hailing from different states across the country have ignited spirituality among the devotees with their outstanding performances of traditional arts of their respective places during the ongoing annual Brahmotsavams in Tirumala.

A total of 1906 artistes belonging to 91 troupes from six states and a union territory have illuminated the four mada streets with their lovely performances, said All Projects Officer Smt Vijayalakshmi. Addressing the media persons in Media Centre and Rambhageecha 2 in Tirumala on Monday, she said, the artistes hailed from AP, TS, TN, Karnataka, Kerala, Odisha, Maharashtra and Puducherry.

She also said, so far 4789 devotees hailing from backward regions of Andhra Pradesh were provided with the Darshan of Sri Venkateswara Swamy as a part of Brahmotsava Darshanam. “They were transported to Tirumala in 101 buses from all 26 districts of AP and darshan has been provided”, she maintained.

Annamacharya Project Director Dr Vibhishana Sharma and Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu and Sri Sudhakar, the Principal of SV College of Music and Dance said, the fine arts college have also elaborated on the cultural and devotional programmes organized by their respective wings during the ongoing annual event.

TTD PRO Dr T Ravi was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వాహ‌న‌సేవ‌ల్లో క‌నువిందుగా కళారూపాలు

– 7 రాష్ట్రాల నుండి 91 బృందాల్లో 1906 మంది క‌ళాకారులు

– 6 రోజుల్లో 4,789 మంది పేద‌వ‌ర్గాల వారికి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

– మీడియా స‌మావేశంలో టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి

తిరుమల, 2022 అక్టోబ‌రు 03: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల‌ వాహనసేవల్లో భ‌క్తుల‌కు క‌నుల‌విందుగా అపురూప‌మైన కళారూపాలు ప్ర‌ద‌ర్శిస్తున్నామ‌ని టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి చెప్పారు. తిరుమ‌ల రాంభ‌గీచా-2లో గ‌ల మీడియా సెంట‌ర్‌లో సోమ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలను క‌ళాకారులు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, గ్యాల‌రీల్లో వేచి ఉన్న భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని తెలిపారు. ఆయా రాష్ట్రాల జాన‌ప‌ద క‌ళారూపాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో విశిష్ట‌త‌ను తెలియ‌జేసేందుకు ప్ర‌ముఖ పండితులతో వ్యాఖ్యానం చేయిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌ల‌తోపాటు తిరుమ‌ల, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు.

91 క‌ళాబృందాల్లో 1906 మంది క‌ళాకారులు

వాహ‌న సేవ‌ల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ నుండి 52, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 25, అన్న‌మాచార్య ప్రాజెక్టు నుండి 14 క‌లిపి మొత్తం 91 క‌ళాబృందాల్లో 1906 మంది క‌ళాకారులు పాల్గొన్నార‌ని వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో క‌ళాకారులు పాల్గొన్నార‌ని, వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు, వేష‌ధార‌ణ‌ క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని తెలియ‌జేశారు. తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లు కునిత‌, పూజ కునిత, సోమన కునిత, కంసాల‌ కళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని తెలిపారు. త‌మిళ‌నాడు నుండి 12 బృందాలు వ‌చ్చాయ‌ని, వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం, మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక‌ బృందం, కేరళ నుండి ఒక‌ బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని వివ‌రించారు.

భ‌క్తి సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

తిరుమల నాదనీరాజనం వేదికపై ఉద‌యం 4.30 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మంగ‌ళ‌ధ్వ‌ని, ఆస్థానమండపంలో ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, భక్తి సంగీతం, అన్న‌మ‌య్య విన్న‌పాలు, హ‌రిక‌థ పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, వాయిద్య సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, తిరుప‌తివాసుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని చెప్పారు.

6 రోజుల్లో 4,789 మంది పేద‌వ‌ర్గాల వారికి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో టిటిడి ఆలయాలు నిర్మించింద‌ని, ఆ ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నామ‌ని తెలిపారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు రెండో తేదీ వ‌ర‌కు 4789 మందికి ద‌ర్శ‌నం చేయించిన‌ట్టు వెల్ల‌డించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 101 బ‌స్సుల ద్వారా ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి బ‌స ఏర్పాటుచేసి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ భ‌క్తులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని, ద‌ర్శ‌నానంత‌రం తిరిగి అవే బ‌స్సుల్లోనే వారి సొంత ప్రాంతాలకు పంపుతున్నామ‌ని తెలిపారు.

అనంత‌రం డాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాక‌ర్ మాట్లాడుతూ ఆయా విభాగాల ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లను తెలియ‌జేశారు.

మీడియా స‌మావేశంలో టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి, స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ‌, ధార్మిక ప్రాజెక్టుల ఏఈవో శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, సూప‌రింటెండెంట్ శ్రీ కాంతికుమార్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.