NARTANA KRISHNA DANCES ON CHANDRAPRABHA VAHANA _ చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tirumala, 03 October 2022 On the evening of the seventh day of the Srivari Brahmotsavam at Tirumala the presiding deity of Malayappa as Nartana Krishna rides atop a Chandra Prabha Vahanam.

On the pleasant evening of the “Moon Day”, Monday, the chief deity of the day as per Sanatana Dharma, the Chandra, or the moon swayed all along the four mada streets carrying Sri Nartana  Krishna. The devotees were mused seeing the dancing Sri Krishna on the cool and pleasant Chandraprabha Vahanam.

As per the scripts in the “Purushottam Praptiyagam” Chandra is described as Lord Vishnu who as an invisible architect evolved solutions for all ills of the society.

According to the holy Hindu scripts, Chandra or the Moon stands for promoting medicinal values among the living beings 

The senior and junior Pontiffs of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, some board members, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమల, 2022 అక్టోబరు 03: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

 చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

వాహనసేవలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ రామేశ్వరరావు, శ్రీ మధుసూదన్ యాదవ్, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ ర‌మేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.