శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు తిరుపతి, 2021 జూలై 18: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా మూడవ రోజైన ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు నిర్వహించారు. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని […]
