PAVITROTSAVAMS IN KAPILSESWARA SWAMY TEMPLE FROM JULY 21 TO 23 _ జూలై 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

TIRUPATI, 18 JULY 2021: The annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple will be observed between July 21 to 23 with Ankurarpanam on July 20. Due to Covid 19 restrictions, this annual fete will be observed in Ekantam.

On the first day Kalasa Puja, Homam, Pavitra Pratista, will be performed. Second day Grandi Pavitra Samarpana, Yagasala Puja and Homam will be performed while on the last day Maha Purnahuti, Kalasodwasana, Pavitra Samarpana will be performed.

Later in the evening Astanam will be performed to Sri Kapileswara Swamy, Sri Kamakshi Ammavaru, Sri Vigneswara Swamy, Sri Subrahmaya Swamy and Sri Chandrikeswara Swamy.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 జూలై 18:  శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూలై 20న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూలై 21న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 22న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 23న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.