వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంతిరుపతి, జనవరి 28, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య ప్రాజెక్టు తలపెట్టిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఉదయం వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన దాదాపు 3000 మంది భక్తులు భజనలతో గోవిందనాథుని స్మరిస్తూ అలిపిరి మార్గంలో తిరుమలగిరులను అధిరోహించారు.మొదటగా భక్తులు తితిదే మూడో సత్రం ప్రాంగణం నుండి తెల్లవారుజామున 4.00 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. బెంగళూరు ఉత్తరాదిమఠం పీఠాధిపతి […]
