Ecstatic crowd of Devotees witness  Balaji Procession at  Kumbha Mela _ అలహాబాదులో శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపునకు అపూర్వ స్పందన

  • 8 km long procession of Balaji  Kalyana ratham attracts huge Allahabad crowds
  • District Magistrate Rajasekhar Flags off  Procession
  • District  SP K P Singh offers Ganga Harathi
  • Daily TTD rituals, Anna prasadam and Publication stall at  Kumba Mela

Allahabad, January 24: The procession of Utsavamurthis of Lord Venkateswara atop the specially designed Kalyana Ratham at the Maha Kumbha Mela this morning attracted huge crowds of devotees and pilgrims who were thrilled at the Darshan of Balaji away from Tirumala.

The eight km long procession held or the first time in the Hindi belt was flagged off  by the District Magistrate Rajasekhar at Central University. Its journey from Central University to Sangam (the confluence of Ganga and Yamuna) via Kutchery road, civil lines, medical Chowraha,Geroge town, MP Marg, Shobatia Bagh, Parade, Kali sadak and Sangam was witnessed by large crowds of devotees. At every junction people  mostly women offered harathis to the deities and sought blessings of the most sacred  deity known to give boons to every one.

The SSP of Allahabad K P Singh who participated in the procession up to the Sangam (confluence of Ganga and Yamuna) offered the most auspicious and prestigious  Ganga Harathi to the deity. Later the procession continued its journey up to the Temple replica installed in the Sector-6 of the Mela grounds for 3 kms.

‘The gaiety and splendor of the specially decked Kalyana ratham of Lord Balaji along with its priests and the caravan of half a dozen vehicles showcased the grandeur of Lord Venkateswara’s glorious following  says  the Public Relations Officer, Sri T Ravi.

 

The TTD Superintendent Engineer Sri Ramachandra Reddy, Sri Sheshadri Swamy, TTD OSD (rituals) and Public Relations Officer, Sri T Ravi led the procession from the front and walked through out the length of the journey.

The complex of replica of the Tirumala temple of Lord Venkateswara at Sangam in Sector 6 will be ordained and cleaned up  on te auspicious muhurtam on January  26th. But it wll  be opened up for darshan only on January 27th after the inauguration of the rituals  and  traditions by the TTD chairman  Sri K Bapiraju and  Executive Officer  Sri L V Subramanyam ,said Sri Ravi.

 

He said the TTD has laid out a program to conduct daily rituals and pujas at the temple on Kumba Mela grounds as it is regularly conducted at Tirumala – Suprabatham (morning rituals) to Ekantha seva (Late night rituals, Cultural activities like Harikathas and Bhajanas will also be conducted by the HIndu Dharma Prachara Praishad dairy in the evening. Arrangements have also been made for distribution of Anna Prasadam (Pulihara) at the temple complex daily. A stall of the Publications division has also been set up for display cum sale of books, calendars, dairies and also Video and Audio CDs produced by the TTD.

ISSUED  PUBLIC RELATIONS OFFICER, CAMP AT ALLAHABAD

 

అలహాబాదులో శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపునకు అపూర్వ స్పందన

అలహాబాదు, జనవరి 24, 2013: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనంగా పిలవబడుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలోని కుంభమేళాలో పాల్గొనడానికి వెళ్లిన శ్రీవారి ఉత్సవమూర్తులు గురువారం నాడు పురవీధులలో ఊరేగుతూ ప్రయాగ క్షేత్రాన్ని చేరాయి. తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని భక్తిపారవశ్యం పొందారు.
దాదాపు 8 కిలోమీటర్ల మేరకు సాగిన ఈ ఊరేగింపును స్థానిక జిల్లా మేజిస్ట్రేటు శ్రీ రాజశేఖర్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు కచేరీ మార్గం, పౌర మార్గాలు, చౌరాహ మెడికల్‌ కళాశాల, జార్జిటౌన్‌, ఎంపీ మార్గ్‌, సొబాటియా భాగ్‌, కాళీ సడక్‌ మీదుగా త్రివేణీ సంగమ ప్రాంతాన్ని చేరుకుంది. దారి పొడవునా శ్రీవారి-దేవేరులకు భక్తులు హారతి నీరాజనాలు పలికారు.
కాగా జిల్లా ఎస్పీ శ్రీ కె.పి.సింగ్‌ త్రివేణీ సంగమం చెంత ఉత్సవమూర్తులకు అత్యంత ప్రసిద్ధిగాంచిన గంగాహారతిని నివేదించారు. అనంతరం ఈ ఉత్సవమూర్తులను కుంభమేళాలోని సెక్టార్‌-6లో తితిదే నిర్మించిన నమూనా ఆలయంలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవి మాట్లాడుతూ శ్రీవారి వైభవం అలహాబాదు నగర వీధులలో ప్రస్ఫుటంగా ప్రాభవించిందని అన్నారు. సర్వాంగసుందరంగా అలంకరించబడిన శ్రీవారి కల్యాణరథంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామి, దేవేరుల ఉత్సవమూర్తుల దర్శనార్థం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేశారని అయన అన్నారు. కాగా సెక్టార్‌-6లో తితిదే ఏర్పాటుచేసిన నమూనా ఆలయాన్ని జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించినా భక్తులకు స్వామివారి దర్శనాన్ని మాత్రం నుండి జనవరి 27వ తేదీ నుండి అనుమతించబడుతుందన్నారు. ఆనాటి కార్యక్రమంలో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పాల్గొంటారని తెలిపారు.
కాగా ప్రతిరోజూ తిరుమల శ్రీవారి ఆలయంలో నివేదించే ఆర్జితసేవలైన సుప్రభాతం మొదలుకుని ఏకాంతసేవ వరకు జరిగే కార్యక్రమాలను ఈ నమూనా ఆలయంలో భక్తుల సందర్శనార్థం నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ హరికథ, భజనలు వంటి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. అదేవిధంగా భక్తులకు పులిహోర, దధ్యోదనం వంటి అన్నప్రసాదాలను తితిదే భక్తులకు అందిస్తుందని తెలిపారు. ఇక తితిదే ప్రచురణలను, ఆడియో, వీడియో సీడీలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రత్యేకాధికారి శ్రీ పాల శేషాద్రి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీ రామచంద్రారెడ్డి, అర్చకస్వాములు పాల్గొన్నారు.
 
అలహాబాదులోని కుంభమేళా నుండి తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.