LEARN ART OF LIVING TO LEAD A HEALTHY LIFE-CVSO _ ఒత్తిడి నివారణతోనే ఆరోగ్యకర జీవనం :తితిదే సీవీఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ 

TIRUPATI, JAN 22: The CVSO of TTDs Sri GVG Ashok Kumar said, the employees should learn the way of living healthy life free from stress and tensions by learning Art of Living.

 

Addressing a tranining session to TTD employees held at SVETA in Tirupati on Tuesday he said high blood pressure and diabetes have become companions to almost every human being as every one today is leading a life of stress. To overcome these health hazards you should learn the art of living. Especially as you will be mostly engaged with multitude of pilgrims, there is an urgent need for all the employees to learn the easy tips to lead a happy life”, he added.

 

Later, Sri Nirmalananda Swamy, a disciple in Sri Ravishankar’s Art of Living took up the training class to the employees of TTD on how to lead a stress free life. SVETA Director Sri Ramakrishna was also present

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఒత్తిడి నివారణతోనే ఆరోగ్యకర జీవనం :తితిదే సీవీఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుపతి, జనవరి 22, 2013: ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ యాంత్రిక జీవనానికి అలవాటుపడి ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నారని, ఒత్తిడి నివారణతోనే ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ సూచించారు. బిపి, షుగర్‌ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెంగళూరు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ శిష్యులు స్వామి నిర్మలానంద తిరుపతిలోని శ్వేత భవనంలో మంగళవారం తితిదే ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఓర్పుతో భక్తులకు సేవలందించాలని సూచించారు. ఇందుకోసం ఉద్యోగులు ఒత్తిడి నివారణ పద్ధతులు సాధన చేసి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు.
అనంతరం స్వామి నిర్మలానంద బిపి, షుగర్‌ వ్యాధులకు కారణాలు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధులు వచ్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తిరుపతిలోని మున్సిపల్‌ గ్రంథాలయంలో ఫిబ్రవరి 4 నుండి 10వ తేదీ వరకు ”లివింగ్‌ వెల్‌” తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అనంతరం సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ స్వామి నిర్మలానందను శాలువతో సన్మానించి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.