“GLORIFY THE IMAGE OF TTD WITH YOUR NOBLE SERVICES AT KUMBHMELA”-TTD EO _ మహాకుంభమేళాలో ఆధ్యాత్మిక స్ఫూర్తితో పనిచేసి తితిదే ప్రతిష్టను పెంచండి : తితిదే సిబ్బందికి ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సూచన

TIRUPATI, JAN 22:  The TTD EO called upon the employees of TTD who are leaving for Allahabad to take part in the world’s massive religious congregation-Maha Kumbhmela, to dedicate themselves in offering sincere services and enhance the image of world renowned Hindu Religious Institution with their deeds.

 

Addressing the employees at SVETA bhavan in Tirupati on Tuesday, the EO said, “You are fortunate enough to get this rare opportunity. So make use of this ‘God Given’ opportunity and render services to the pilgrims as representatives of this great institute with disciplene, devotion and dedication. Every gesture of yours at Kumbhmela speaks a lot as you will be representing the globally acclaimed Tirumala Tirupati Devasthanams. So render selfless services to the visiting pilgrims whole-heartedly and glorify the reputation of TTD to further heights”, he reiterated.

 

Earlier elaborating on the significance of Maha Kumbhmela, Hindu Dharma Prachara Parishad Secretary(HDPP) Sri K Venkat Reddy said Kumbhmela means Vishwa Mela. “The one which is going at Prayag is more auspicious because it is said to be taking place almost after 144 years and hence called Maha Kumbhmela. You are all fortunate to take part in this rarest and holiest and massive auspicious fair which is taking place with noble mission to bring all the Hindus on to a single platform and strengthen the age old Hindu Sanatana Dharma. Be a part of this holiest mission and sanctify your lives”, he added.

 

TTD Tirupati JEO Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar, Transport GM Sri P Sesha Reddy, HDPP Special Officer Sri Raghunath were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మహాకుంభమేళాలో ఆధ్యాత్మిక స్ఫూర్తితో పనిచేసి తితిదే ప్రతిష్టను పెంచండి :
తితిదే సిబ్బందికి ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సూచన

తిరుపతి, జనవరి 22, 2013: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదు నగరంలో వెలసి ఉన్న ప్రయాగ క్షేత్రంలో దాదాపు 144 సంవత్సరాల అనంతరం జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనడానికి వెళుతున్న తితిదే సిబ్బంది ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తితో పనిచేసి తితిదే ప్రతిష్టను ఇనుమడింప చేయాలని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సిబ్బందికి పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు తిరుపతిలోని శ్వేత భవనం నుండి తొలి విడతగా కుంభమేళాలో పాల్గొనడానికి బయల్దేరిన 140 మంది తితిదే సిబ్బందిని ఉద్దేశించి ఈవో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాలో పాల్గొనే అవకాశం ఎంతో ఉత్కృష్టమైనదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిబ్బంది ఆధ్యాత్మికభావనతో తమ కర్తవ్యాన్ని కుంభమేళాలో సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు. ”మీ దైనందిన చర్యలలో తితిదే ప్రతిష్ట ప్రతిబింబిస్తుందని కనుక ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో తమ తమ విధులను నిర్వర్తించి ప్రపంచ భక్తజనులకు తితిదే ప్రాశస్త్యాన్ని తెలియజెప్పాలి” అని ఆయన అన్నారు.
”ఈ యాత్ర మీ జీవితాన్ని పారమార్థిక దిశగా మళ్లిస్తుందనడంలో సందేహం లేదు. ఇది మీలో ఆధ్యాత్మిక మార్పునకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తుందని నా పూర్తి విశ్వాసం. మీరు పొందే ఈ అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని మీరు తిరిగి వచ్చిన తరువాత మీ సహచరులకు, బంధుమిత్రులకు విరివిగా పంచండి” అని ఆయన అన్నారు.
అంతకుమునుపు కుంభమేళా ప్రాశస్త్యాన్ని హిందూధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వివరిస్తూ కుంభమేళా అంటే విశ్వ ఆధ్యాత్మిక మేళా అని అన్నారు. ఈ కుంభమేళాలో అటు జలప్రాధాన్యం, ఇటు స్థల ప్రాధాన్యం రెండూ కలగలిపి ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతున్నదని ఆయన అన్నారు. గంగా-యమున-సరస్వతి నదీమతల్లుల త్రివేణీ సంగమంలో తీర్థస్నానాన్ని ఆచరించడం అనేది ఒక మధురానుభూతి అన్నారు. ఈ క్షేత్రంలో ఆధ్యాత్మిక ఆనందమే కాకుండా అందరినీ ఒకేతాటిపై నిలిపే ఏకతా సిద్థాంతం కూడా పరిఢవిల్లుతోందని, ఈ కారణంగానే కోట్లాది మంది భక్తులు త్రివేణీ సంగమ స్నానాలు ఆచరిస్తూ తరిస్తున్నారని అన్నారు.
హిందూ ధర్మంలో ఏకతా నిర్మాణం కోసం జరుగుతున్న ఈ బృహత్తరమైన ప్రక్రియలో ప్రయాగ క్షేత్రం ఒక అద్వితీయమైన తీర్థ-క్షేత్ర శక్తిగా అలరారుతున్నదని ఆయన విశ్లేషించారు.
అనంతరం తిరుపతి జెఈఓ శ్రీ పి.వెంకటరామిరెడ్డి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి సాంస్కృతిక రాయబారులుగా తితిదే సిబ్బంది కుంభమేళాలో పాల్గొని తీర్థస్నానం ఆచరించడమే కాకుండా క్షేత్రసేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, తితిదే రవాణా శాఖ ముఖ్య అధికారి శ్రీ పి.శేషారెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాధ్‌ పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.