అర్చకులు శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్య
తిరుపతి, 2012 ఆగస్టు 25: అర్చకులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో 5 రోజుల పాటు జరిగిన వైదిక స్మార్థ నాలుగో బ్యాచ్ అర్చక పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ అర్చకులు సంస్కారవంతులైనప్పుడే సమాజం సంస్కరించబడుతుందని అన్నారు. అర్చకులకు వాక్శుద్ధి ఉండాలన్నారు. […]
