తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

తిరుపతి, జూన్‌ 22, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, సామవేద పుష్పాంజలి నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6.30 నుండి 7.45 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం కూడా శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.