2nd of Sri Padmavathi Ammavari Float Festival _ తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

As part of ongoing five day Annual Float Festival, the second day is dedicated to the idol of  Lord Sundaraja Swamy Varu and his consorts. The idols were is taken out in a procession from Sri Padmavathi ammavari Temple to Pushkarni situated near the Temple on Thursday evening.
 
 
DyEO(PAT), Sri Bhaskar Reddy, Sri Venugopal, AEO Smt Nagarathnamma, temple staff and devotees took part. 
తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

తిరుపతి, జూన్‌ 20, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన గురువారం శ్రీ సుందరరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.