DWAJAROHANAM IN SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Dwajarohanam’ was performed in the temple, signalling the commencement of the nine-day annual `Brahmotsavam’ in Lord Prasanna Venkateswara Swamy temple at Appalayagunta about 25km from Tirupati on Tuesday. The sacred yellow cloth flag with the imprint of Lord Garuda, the celestial carrier of Lord Maha Vishnu, was hoisted atop the golden flag post `Dwajasthambham’ situated inside the temple complex at the auspicious “Simha lagnam at bet 10.40am to 10.50 a.m. amidst the traditional recitation of Vedic hymns by temple priests.
 
TTD JEO Sri P.Venkatarami Reddy, DyEO Sri Bhaskar Reddy, AEO Smt Nagarathnamma, TTD Agama Advisor Sri Vishnu Bhattacharya and devotees took part.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూన్‌ 18, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 10.40 గంటలకు సింహ లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం నిర్వహించారు.
 
ఆస్థానం అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేపట్టారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.
 
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో తితిదే గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణలు చేపట్టారు. శ్రీ సిద్ధేశ్వర స్వామివారు శ్రీవారి కోసం ప్రార్థిస్తున్న భంగిమలో ఏర్పాటుచేసిన సెట్టింగ్‌ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తితిదే ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.
 
అన్నదాన వితరణ కేంద్రం ప్రారంభం
 
బ్రహ్మోత్సవాల మొదటిరోజున తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఆలయం వద్ద అన్నదాన వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు.
 
హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం తిరుపతికి చెందిన శ్రీ రాధాకృష్ణ బృందం విష్ణుసహస్త్రనామ పారాయణం, శ్రీ ఎం.వి.రమణారెడ్డి ధార్మికోపన్యాసం, శ్రీ జి.ప్రభాకరశర్మ పురాణ ప్రవచనం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీమతి విజయకుమారి భాగవతారిణి హరికథ, శ్రీ రాజమోహన్‌ బృందం భక్తి సంగీతం, వికారాబాద్‌కు చెందిన శ్రీ ఎ.శ్రీహరి భక్త పుండరీక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, తితిదే వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ పీతాంబర రాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.