వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, జూన్‌ 19, 2013: కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమ య్యాయి. మొదటిరోజు శ్రీ కృష్ణ స్వామివారు పద్మసరోవరంలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీకృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేయనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీకృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల్లో రెండో రోజైన గురువారం శ్రీ సుందరరాజస్వామివారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.