Annual Vasanthotsavam in Sri Kalyana Venkateswara Swamy Temple _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 28 May,2013: The three-day annual ‘Vasanthotsavam’ began in the Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram near Tirupati on Tuesday evening. The event is meant to be a diversion to the celestial beings from the scorching sun in the peak summer month.
 
The priests gave a celestial bath to the deities of the Lord and His consorts at Kalyanotsava Mandapam inside the temple complex. The deities were later taken out on a procession on the four mada streets around the temple.
 
Local Temple DY EO Smt Reddamma, AEO Sri Lakshman Naik and devotees took part.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం

తిరుపతి, మే 28, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్త్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
 
మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, స్వరపుష్పార్చన సేవ, సహస్త్రకలశాభిషేకం, తిరుప్పావడ సేవలను రద్దు చేశారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, సూపరింటెండెంట్లు శ్రీ కృష్ణారావు, శ్రీ దినకర్‌రాజు, ఇతర అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.