సకలజగద్రక్షకుడు సూర్యభగవానుడు – తితిదే ఇఓ
సకలజగద్రక్షకుడు సూర్యభగవానుడు – తితిదే ఇఓ తిరుమల, 17 ఫిబ్రవరి – 2013: సకల జీవకోటికి తన తేజోమయమైన కాంతి కిరణాలతో జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యుడు సర్వజగద్రక్షకుడని తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. రథసప్తమి సందర్భంగా ఆయన విలేకరులతో తిరుమలలో ఆదివారంనాడు వాహనమండపం దగ్గర మాట్లాడుతూ ఈ పర్వదినంనాడు ఒకేరోజు శ్రీమలయప్పస్వామివారు సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆ స్వామి సుమనోహరరూపాన్ని కనులారా సందర్శించడానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేయడం ఆనందదాయకమన్నారు. ఇది బ్రహ్మోత్సవ వైభవాన్ని తలపిస్తున్నదన్నారు.కాగా […]
