TTD EO REVIEWS ON SRINIVASA MANGAPURAM BRAHMOTSAVAM ARRANGEMENTS _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే ఈవో సమీక్ష 

TIRUPATI, FEB 4: TTD EO Sri LV Subramanyam on Monday reviewed the ongoing arrangements for the annual Brahmotsavams of Lord Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram that is scheduled from March 1 to March 9, in his Chambers at TTD Administrative building in Tirupati with the HODs of various departments.
 
During his review, he called upon the officials to make elaborate arrangements in a grand manner and not to compromise. He directed the officials to send Prachara Rathams to the near by 100 villages at Srinivasa Mangapuram and organize Sobha Yatra in Tirupati on March 3. He said the presiding deity of Sri Kalyana Venkateswara Swamy will be decorated with Lakshmi Haram which will be brought from Tirumala temple on the day of Garuda Seva which falls on March 5.
 
The EO also asked the officials to set up laddu prasadam selling stalls during the nine-day mega event. He also asked them see the possibility of introducing Vada Prasadam for the religious fete. The EO directed the officials to introduce Vastra Bahumanam by Grihasta Pilgrims for the brahmotsavams as in the case of Sri Kodanda Rama Swamy temple which garnered good response from the grihasta pilgrims.
 
Later the EO directed the concerned officials to print the wall papers and posters for the mega religious event in Telugu, English, Kannada and Tamil and also release the books depicting the importance of Vahanams. He instructed to set up the book stalls and sell TTD publications. He directed the HDPP officials to arrange religious, spiritual and devotional programmes including Bhajans, Kolatams etc.
 
The EO instructed the Engineering officials and Garden department Deputy Director to come out interesting themes of mythology for electrical illumination and floral decorations respectively.
 
Later the EO also reviewed on Sri Kapileshwara Swamy Brahmotsavams which are scheduled from March 3 to 12. Heads of all departments also took part in the review meeting.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే ఈవో సమీక్ష

తిరుపతి, ఫిబ్రవరి 04, 2013: వచ్చే నెల మార్చి ఒకటి నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగనున్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు, మార్చి మూడు నుండి 12వ తేదీ వరకు జరుగనున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం తిరుపతిలోని ఆయన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ రెండు బ్రహ్మోత్సవాలపై తిరుపతి చుట్టుపక్కన గల వంద గ్రామాలకు ప్రచార రథాలు పంపి భక్తులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్చి 3వ తేదీన తిరుపతి నగరంలో శోభాయాత్ర నిర్వహించాలని కోరారు. గరుడ సేవ రోజున తిరుమల నుండి లక్ష్మీహారం తీసుకొచ్చి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అలంకరించాలని ఆదేశించారు. ఈ ఏడాది గృహస్తుల నుండి స్వామివారికి వస్త్రబహుమానం స్వీకరించాలని నిర్ణయించారు. శ్రీనివాసమంగాపురంలో శ్రీవారి ఆలయం తరహాలో వడ ప్రసాదం ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.
 
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బ్రహ్మోత్సవాల గోడపత్రికలు రూపొందించాలని, వాహనసేవల వివరాలతో పుస్తకాలు ముద్రించాలని, పుస్తక విక్రయశాలలు తొమ్మిది రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
ఈ సమావేశంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.