RELEASE OF WALL POSTER ON SRI GOVIDARAJA SWAMY VARI FLOAT FESTIVAL _ శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ 

శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, ఫిబ్రవరి 14, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ తెప్పోత్సవాల పోస్టర్లను తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి తితిదే పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఏడు రోజుల పాటు జరుగనున్న తెప్పోత్సవాల్లో తిరుపతివాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
 
కాగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం శ్రీ కోదండరామస్వామి, 20వ తేదీ బుధవారం శ్రీ పార్థ సారథిస్వామి, 21వ తేదీ  గురువారం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి, 22వ తేదీ శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో గోవిందరాజస్వామివారు తెప్పపై ఐదు చుట్లు చుట్టనున్నట్టు తెలిపారు. చివరి మూడు రోజులైన శని, ఆది, సోమవారాల్లో శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేయనున్నారని వివరించారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జెఈవో తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌పిళ్లై, ఇతర అధికారులు పాల్గొన్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
Tirupati, Feb 14 : Sri P.Venkatarami Reddy, Joint Executive Executive Officer TTDs released wall posters on The Annual Float Festival of Sri Govindaraja Swamy Vari Temple, Tirupati which will be conducted for seven days from Feb 19 to 25.
 
During the festival, the processional deities Sri Kodanda Rama Swamy on Feb 19, Sri Parthasaradhi Swamy on Feb 20, Sri Kalyana Venkateswara Swamy on Feb 21, Sri Krishna Swamy Varu and Andal Ammavaru on Feb 22, Sri Govindaraja Swamy Varu on Feb 23 to Feb 25 will be taken out procession in Pushkarini in the evenings.
 
Special programmes such as bhajans, annamaiah sankeerthanas programmes will be performed by TTDs Dharma Prachara Parishad, Annamacharya Project during the programmes.
 
DyEO(Local Temples) Sri Chandrasekhar Pillai and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI