BLOOD DONATION CAMP HELD _ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా టీటీడీ మహిళా ఉద్యోగుల రక్తదానం
TIRUPATI, 07 MARCH 2023: In connection with International Women’s Day on March 8, TTD EO Sri AV Dharma Reddy visited the Blood Donation camp held by women employees’ at Central Hospital in Tirupati in Tuesday.
Speaking on the occasion the EO complimented the women employees for coming forward to donate blood and wished all the Women Employees’ of TTD a Happy International Women’s Day.
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CMO Dr Muralidhar, RMO Dr Narmada, DyEO Welfare Smt Snehalata, Doctors Smt Harita, Smt Suharlata and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా టీటీడీ మహిళా ఉద్యోగుల రక్తదానం
తిరుపతి 7 మార్చి 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కేంద్రీయ ఆసుపత్రిలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీ ధర్ , సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ,ఆర్ఎంవో డాక్టర్ నర్మద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది