METLOTSAVAM AT ALIPERI_ అలిపిరిలో ఘనంగా మెట్లోత్సవం
అలిపిరిలో ఘనంగా మెట్లోత్సవం తిరుపతి, జూన్-28, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల అమృతోత్సవాల కార్యక్రమంలో భాగంగా జూన్ 30వ తేదిన సోమవారం ఉదయం 6-30గంటలకు మెట్లోత్సవం నిర్వహిస్తారు. అలిపిరి వద్దగల పాదాల మండపం నుండి ఉదయం 6-30 గంటలకు ప్రారంభమయ్యేఈ మెట్లోత్సవం 11 గంటలకు తిరుమల చేరుకుంటుంది. పిదప తిరుమల ఆస్థానమండపమునందు భక్తులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నడచి వెళ్ళిన భక్తులందరిని ఉచితంగా స్వామివారి దర్శనానికి అనుమతించి ప్రసాదాలు ఇస్తారు. ఈ మెట్లోత్సవంలో తితిదే పాలక మండలి […]