రేపటి నుండి శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
రేపటి నుండి శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి, మార్చి-31, 2011: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 9 వరకు వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కాగా సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, పితృవాక్పరిపాలకుడు అయిన శ్రీ కోదండరామస్వామి వెలసి ఉన్న శ్రీ కోదండరామాలయం క్రీ.శ. 1480 సంవత్సరములో శ్రీ నరసింహమొదలియార్ నిర్మించెనని శాసనాధారాలు కలవు. ఇంతటి ప్రాచీన ప్రాభవం కలిగిన శ్రీ రామాలయంలో తితిదే ప్రతి ఏటా వార్షిక బ్రహోత్సవాలను అత్యంత […]