KODANDA RAMA GRACES ON ASWA VAHANA _ అశ్వవాహనంపై శ్రీకోదండరామస్వామి దర్శనం
అశ్వవాహనంపై శ్రీకోదండరామస్వామి దర్శనం తిరుపతి, 2023 మార్చి 27: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు సోమవారం రాత్రి అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియామకుడు. పరమాత్మను […]