MAHA SAMPROKSHANA AT SRIVARI METTU, SV TEMPLE FROM OCTOBER 18-20 _ అక్టోబరు 18 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి మెట్టు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ
Tirupati, 17 October 2021: TTD is organising Astha bandhana Maha Samprokshana at Sri SV temple Srivari Mettu near Srinivasa Mangapuram from October 18-20 in Ekantham as per covid guidelines.
As part of festivities, the Ankurarpanam fete will be performed on October 18, Monday. On October 19&20 vaidika programs will be held at the yagashala including Asta bandhana, visesha Homas, Maha Shanti abhisekam, Purnahuti and Avahana Archana ahead of Maha samprokshana.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 18 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి మెట్టు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ
తిరుపతి, 2021 అక్టోబరు 17: శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద గల శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ అక్టోబరు 18 నుండి 20వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అక్టోబరు 18వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, అకల్మషహోమం, సాయంత్రం 6.30 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది.
ఇందులో భాగంగా అక్టోబరు 19వ తేదీ ఉదయం 9 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు విశేష హోమాలు, అష్టబంధనం నిర్వహిస్తారు.
అక్టోబరు 20వ తేదీ ఉదయం 6 నుండి 7 గంటల వరకు మహాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహూతి, అవాహన అర్చన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు మహా సంప్రొక్షణ జరుగుతుంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.