TIRUCHANOOR TEMPLE TO BE CLOSED ON GRAHANAM DAYS _ అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

TIRUPATI, 18 OCTOBER 2022: Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor remains closed on October 25 and November 8 following solar and lunar eclipses on the respective days.

TTD has cancelled all arjita sevas, VIP Break and Special Darshan for pilgrims on these days.

Devotees are requested to note this.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం

– శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌

అక్టోబ‌రు 2022, తిరుప‌తి 18: సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా అక్టోబ‌రు 25వ తేదీ ఉద‌యం 8 నుండి రాత్రి 7 వ‌ర‌కు తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.

అక్టోబ‌రు 25న సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. అనంత‌రం ఆల‌య తలుపులు తెరిచి, శుద్ధి, పుణ్య‌హ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు చేప‌డ‌తారు.

అదేవిధంగా న‌వంబ‌రు 8న మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7 గంట‌ల‌కు అమ్మ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా స‌ర్వ‌ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, బ్రేక్ ద‌ర్శ‌నాల‌తోపాటు అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించ‌గ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.