అక్టోబరు 4న రిటైర్డ్ లెక్చరర్లకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు
అక్టోబరు 4న రిటైర్డ్ లెక్చరర్లకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు
తిరుపతి, 2012 సెప్టెంబరు 22: 2012-13 విద్యాసంవత్సరానికి గాను తితిదే విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో గంటల ప్రాతిపదికన జూనియర్ లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హులైన జెఎల్ లేదా డిగ్రీ రిటైర్డ్ లెక్చరర్లకు అక్టోబరు 4వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తితిదే ప్రెస్ భవనంలోని రెండో ఫ్లోర్‌లో ఉన్న తితిదే విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.
తితిదే జూనియర్ కళాశాలల్లో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి. తెలుగు-1, సంస్కృతం-1, కామర్స్-2, జాగ్రఫి-1, ఫిజిక్స్-1, జువాలజి-2, ఎకనామిక్స్-1, సివిక్స్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అదేవిధంగా డిప్లొమా ఇన్ హియరింగ్ ఇంపేర్డ్ అర్హత గల రిటైర్డ్ లెక్చరర్లు శ్రీ వేంకటేశ్వర బధిర జూనియర్ కళాశాలలో గంటల ప్రాతిపదికన పనిచేసేందుకు ఇదేరోజున వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ అర్హత గలవారికి సబ్జెక్టుల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. హిస్టరీ -1, సివిక్స్-1, ఎకనామిక్స్-2, తెలుగు-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థుల వయసు 65 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు వయసు ధ్రువీకరణ పత్రం నకలు, పెన్షన్ ధ్రువీకరణపత్రం వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అవసరమైన పక్షంలో డెమో క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్డ్ లెక్చరర్లను గంటల ప్రాతిపదికన మాత్రమే విధులకు అనుమతించడం జరుగుతుంది. గంటకు రూ.150/- చొప్పున గౌరవ వేతనం అందించడం జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.