BALALAYA AT ALATTUR TEMPLE FROM OCTOBER 25-27 _ అక్టోబ‌రు 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు ఆలత్తూరు శ్రీ వ‌ర‌ద‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ”బాలాలయం”

Tirupati, 23 October 2021: TTD is organising Balalayam fete at the Sri Varada Venkateswara temple in Alattur from October 25-27 with Ankurarpanam on October 25.

According to legends, Balalayam fete is conducted whenever rejuvenation of sanctum is taken up, wherein a model sanctum is placed inside temple complex with portraits of idols and daily rituals are conducted till works complete with Maha Samprokshana ritual.

As part of festivities, special program will be held at yagashala for three days and on October 27 morning at Dhanur lagnam between 8am and 11.30 am.

The customary practices of Purnahuti, Avahana Prokshana, Balalaya Samprokshana will be performed.

Thereafter devotees will be allowed for Sarva Darshan.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు ఆలత్తూరు శ్రీ వ‌ర‌ద‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ”బాలాలయం”

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 23: కార్వేటి నగరం మండలం ఆలత్తూరు శ్రీ వ‌ర‌ద‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం అక్టోబ‌రు 25న ఉద‌యం 10.30 గంట‌ల‌కు రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయం ప్రాంగ‌ణంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేస్తారు. మహా సంప్రోక్షణ జరిగేవరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఆలయంలోని యాగశాలలో అక్టోబ‌రు 25 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అక్టోబ‌రు 27వ తేదీ ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ధ‌నుర్‌ లగ్నంలో పూర్ణాహూతి, ఆవాహ‌న ప్రోక్ష‌ణ‌, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉద‌యం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు బాలాల‌యంలో స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.