PAVITROTSAVAMS AT JUBILEE HILLS TEMPLE FROM OCTOBER 31- NOVEMBER 2 _ అక్టోబరు 31 నుండి నవంబరు 2వ తేదీ వరకు హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati, 22 October 2021: TTD is organising the sacred Pavitrotsavsm festival at Sri Venkateswara Temple, Jubilee Hills, Hyderabad from October 31- November 2 in Ekantham as per covid guidelines with Ankurarpanam on October 30 evening
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 31 నుండి నవంబరు 2వ తేదీ వరకు హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2021 అక్టోబరు 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి నవంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా అక్టోబరు 30వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఆచార్య రుత్విక్వరణం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో భాగంగా అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.